వర్షాభావ పరిస్థితుల వల్ల పప్పుశనగ పంట ఎండిపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నష్టం వాటిల్లిందో అంచనా వేయలేదు. రైతులు కష్టాల్లో ఉన్నా వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం కణేకల్లు మండలం మల్యం గ్రామ శివారులో ఎండిపోతున్న పప్పుశనగ పొలాలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. చంద్రబాబు హయాంలో పప్పుసెనగకు నష్టపరిహారం అందించినా వైకాపా ప్రభుత్వ హయాంలో చిల్లిగవ్వకు పరిహారం అందడం లేదని రైతు శివరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖరీఫ్, రబీ రెండు పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలవ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 60 వేల ఎకరాల్లో అపరాలు సాగు చేశారని, రైతులు ఈ-క్రాప్‌లో వివరాలు నమోదు చేయకుంటే ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తుందని కాలవ ప్రశ్నించారు.
ఈ-క్రాప్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించాలని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.అన్నదాతల సంక్షేమంపై ఎమ్మెల్యేలకు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. దోపిడీపై కాకుండా పాలనపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో తెదేపా మండల కన్వీనర్ లాలెప్ప, నాయకులు మరియప్ప, నరేంద్ర, జయరాంచౌదరి, రమేష్, గోపాల్ రెడ్డి, సుదర్శన్, ఆది, వెంకటేష్ చౌదరి, ముజ్జు, నాగరాజు, ప్రభాకర్, తదితరులున్నారు.
Discussion about this post