మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు మరియు సోషల్ మీడియాలో వారి అసభ్యకరమైన వ్యాఖ్యలకు ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ ప్రకటించారు.
ఈ ఘటనపై గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, బాలయ్య, రవి ఈ నెల 5న నార్పల మండలం మద్దాలపల్లి జాతరలో ఉన్నారు.
మద్యం సేవిస్తూ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ చర్యలు తీసుకుని వ్యక్తులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Discussion about this post