సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ మాట్లాడుతూ అధునాతన పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆదివారం పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగంలో రూ.4.5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన క్యాథ్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు.
పుట్టపర్తి: అధునాతన పరికరాలతో వైద్యసేవలు అందిస్తున్నామని సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో రూ.4.5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతన క్యాథ్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు.
హృదయ సంబంధ వ్యాధులను నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి క్యాథ్లాబ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాధి నిర్ధారణ, చికిత్స సులభతరం అవుతుందన్నారు. దవాఖానకు వచ్చే రోగులకు ఆధునిక వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో అన్ని విభాగాల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మరింత విస్తృతమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు చక్రవర్తి, నాగానంద, దేశీయ సాయి సంస్థల అధ్యక్షుడు నిమిష్‌పాండే, ఆసుపత్రి డైరెక్టర్ గురుమూర్తి, కార్డియాలజీ విభాగాధిపతి అయ్యర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Discussion about this post