టీడీఈపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని, సొంత తండ్రికి దూరమయ్యారన్నారు.
ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని, సొంత తండ్రి దూరమయ్యారని, ఎవరూ బాధపడవద్దని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. . ఈ నెల 23న నిడిగల్లు గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు శ్రీరాములు తెలిపారు.
మంగళవారం గ్రామంలో పర్యటించి సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ సభకు శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి, కదిరి ఇన్‌చార్జి కందికుంట ప్రసాద్‌తోపాటు పలువురు నాయకులు హాజరవుతారని తెలిపారు.
విజయవంతం చేయాలని శ్రీరాములు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు రామ్ మోహన్, నాయకుడు విజయ్ కుమార్, గ్రామ సర్పంచి వెంగమనాయుడు, చంద్రశేఖర్ నాయుడు, ధనుంజయనాయుడు, శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post