కళ్యాణదుర్గం:
బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అంకితమైన దార్శనికత మహాత్మా జ్యోతిరావు ఫూలే అని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, ఎమ్మెల్సీ మంగమ్మ కొనియాడారు.
మంగళవారం కళ్యాణదుర్గంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి, ఎమ్మెల్సీలు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సమాజంలోని అట్టడుగు వర్గాలకు విద్యను అందించడంలో మరియు అభివృద్ధి చేయడంలో ఫూలే యొక్క అవిశ్రాంత కృషిని వారు ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జయం ఫణి, వైఎస్ ఆర్ సిపి మండల కన్వీనర్ సర్వోత్తమ, నాయకులు బ్రహ్మయ్య, భట్టువానిపల్లి అంజి, హనుమంతరాయుడు, ఉమేష్ రెడ్డి, మల్లికార్జున, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post