శీతాకాలంలో, మడమల మీద చర్మం పొడిగా మరియు పగుళ్లు ఏర్పడుతుంది. దీంతో చాలా మంది అమ్మాయిలు నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంటి చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎలాగో తెలుసుకుందాం..
మడమల మీద పొడిబారిన చర్మాన్ని తిరిగి మాయిశ్చరైజ్ చేయడానికి తరచుగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. అలాగే రాత్రి పడుకునే ముందు షియా బటర్ రాసుకుంటే ఫలితం ఉంటుంది.
ఓట్స్, తేనె, బాదం నూనె, పాలు, పంచదార చిన్న మొత్తంలో తీసుకుని చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని మడమల మీద అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. అరగంట తర్వాత కడిగేసి.. ఆపై కొబ్బరినూనె రాయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మడమల మీద ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి మృదువుగా మారుతాయి.
పసుపు-ఆలివ్ నూనెతో చేసిన పేస్ట్‌ను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మడమలకి అప్లై చేయాలి. అప్పుడు సాక్స్ వేసుకోవడం వల్ల ఈ మిశ్రమం బెడ్ షీట్లకు అంటుకోకుండా ఉంటుంది. ఇది ఉదయం కడగాలి. మీరు ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే, కొద్ది రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి.
పడుకునే ముందు పాదాలకు పెట్రోలియం జెల్లీని రాసి కాసేపు మసాజ్ చేయాలి. దీని కారణంగా చర్మంలోకి బాగా చొచ్చుకుపోతుంది. ఫలితంగా చర్మం మృదువుగా మారుతుంది.
కొబ్బరినూనె లేదా బాదం నూనెతో పాదాలు మరియు మడమలకి రెగ్యులర్ గా మర్దన చేయడం ప్రయోజనకరం.
పాలకూర, చేపలు, వాల్‌నట్స్, సోయా మొదలైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ ఇ పుష్కలంగా ఉండే వెజిటబుల్ ఆయిల్స్, గ్రీన్ వెజిటేబుల్స్, గోధుమలు, చేపలు, తృణధాన్యాలు, నట్స్ మొదలైన వాటిని తీసుకోవడం కూడా మంచిది.
డ్రై హీల్స్‌ను నివారించడానికి రసాయనాలు అధికంగా ఉండే సబ్బులు మరియు స్నానపు ద్రవాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే స్నానం చేసిన తర్వాత పాదాలు, మడమలను పొడిగా తుడవాలి.
Discussion about this post