అనంతపురం:
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసి పేద పిల్లలకు ఉన్నత విద్యను అందించిన విద్యా ప్రదాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు.
ఆ పథకం కింద ఉచితంగా చదివి ఎంతో మంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ (ఎస్‌కేయూ) క్యాంపస్‌లో పాలక మండలి అనుమతితో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని బుధవారం వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డితో కలిసి ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం న్యాయశాఖ నుంచి కామన్ మెస్ హాల్, సరస్వతి హాస్టల్, న్యాయశాఖ మూట్ కోర్టు, నక్షత్ర గార్డెన్ వరకు నిర్మించిన డబుల్ రోడ్డును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాధవ్, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ నాయకుడే కాదు గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 1982-83లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యాసంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. సీఎంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది పేదలకు ఉచితంగా ఉన్నత విద్యనందించారన్నారు.
వైఎస్ఆర్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఆచార్యులు, పరిశోధక విద్యార్థుల కోసం యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ జితేంద్ర కుమార్ మిశ్రా పంపిణీ చేసిన రెండు బ్యాటరీ కార్లను ఎంపీ, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ గోపాల్ రెడ్డి, వైఎస్ ఆర్ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, ప్రొఫెసర్ శంకర్ నాయక్, టి.పురుషోత్తంరెడ్డి, కరాటే పెద్దన్న పాల్గొన్నారు.
Discussion about this post