అనాథలు ఎక్కడా రాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని కలెక్టర్ గౌతమి బాలసదన్, శిశు గృహ కేంద్రాలను ఆదేశించారు. ఆదివారం అనంతపురంలోని ఆయా కేంద్రాలను తనిఖీ చేశారు.
అనంతపురం(శ్రీనివాసనగర్): అనాథలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. ఆదివారం అనంతపురంలోని ఆయా కేంద్రాలను తనిఖీ చేశారు. ముందుగా ఆ రెండు కేంద్రాల్లోని పిల్లలతో మాట్లాడారు.
శిశు గృహంలో నవజాత శిశువుల ఆరోగ్యం, వారికి అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం బాల సదన్‌లో బాలికలతో మాట్లాడారు. ఆవరణలో మొక్కలు నాటారు. వివిధ పోటీల్లో గెలుపొందిన బాలికలకు బహుమతులు అందజేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడి ప్రజలంతా అనాథలేనని.. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
పీడీ శ్రీదేవి, నోడల్ అధికారి వనజాక్షి, బాల సదన్ సూపర్ వైజర్లు నేతాజీ, ఇన్ చార్జి డీసీపీఓ వెంకటేశ్వరి, చైల్డ్ హోమ్ మేనేజర్ దీప్తి, ఐసీపీఎస్ పీఓ చంద్రకళ, ఎల్ సీపీఓ సంధ్యారాణి, సామాజిక కార్యకర్త లక్షీదేవి, చైల్డ్ లైన్ కృష్ణమాచారి, నాగలక్ష్మి, సంధ్య, రాజేశ్, వెంకట్, వసంతల. ల క్ష్మీ, ఆనంద్, సురేష్, సుహాసిని, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
Discussion about this post