ఉరవకొండ:
మండలంలోని వై.రాంపురంలో స్థానిక రైతులు సాగు చేసిన మిర్చి పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతు దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పుష్పావతి అనే మహిళా రైతు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.6 లక్షలు అప్పు చేసి తనకున్న మూడెకరాల్లో మిర్చి సాగు చేసింది.
ఈ పంట సుమారు మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది, దీంతో రైతు దంపతులు మార్కెట్‌కు రవాణా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, పండిన పంట గురించి తెలుసుకున్న అగంతకులు రెండు రోజుల క్రితం రాత్రిపూట మిర్చి దిగుబడి మొత్తాన్ని రహస్యంగా కోసి వాహనంలో ఎక్కించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న రైతు దంపతులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, దొంగలు చోరీకి గురైన పంటతో తప్పించుకున్నారు. దీంతో బాధిత రైతులు పుష్పావతి, నారాయణ గురువారం సీఐ తిమ్మయ్యకు ఫిర్యాదు చేశారు.
ఆ గ్రామంలోని టీడీపీ పార్టీకి చెందిన సానుభూతిపరులకు ఈ చోరీకి సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు.
Discussion about this post