రామగిరి మండల పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో మంగళవారం రాత్రి మారెమ్మ, ముత్యాలమ్మల ఊరేగింపు సందర్భంగా వివాదం తలెత్తింది.
కులం పేరుతో దళితులపై దాడులు
తమకు ప్రాణహాని ఉందని కలెక్టర్, ఎస్పీలకు బాధితులు విన్నవించారు
రామగిరి మండల పరిధిలోని ఏడుగుర్రాలపల్లిలో మంగళవారం రాత్రి మారెమ్మ, ముత్యాలమ్మల ఊరేగింపు సందర్భంగా వివాదం తలెత్తింది. దళితులపై వైకాపా వర్గీయులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
తమపై జరిగిన దాడి గురించి బాధిత దళిత యువకులు పెద్దమ్మ పూజారి రాము, సురేష్ సామాజిక మాధ్యమాల వేదికగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు విన్నవించారు. మంగళవారం రాత్రి తమ గ్రామంలో ఆచారం ప్రకారం కోడి బలి ఇచ్చి జాతర ఎందుకు పెట్టారని వైకాపా నాయకుడు మచ్చన్న తనను కులం పేరుతో దూషించాడని, తనపై దాడికి పాల్పడ్డాడని పూజారి రాములు ఆరోపించారు.
దాడి సమయంలో అడ్డంగా వచ్చిన తమ్ముడు సురేష్‌పై కూడా మచ్చన్న బంధువులు మారెప్ప, హరీష్, యాష్ రాజేష్, మరికొందరు దాడి చేసి తోసుకున్నారని తెలిపారు. వారి నుంచి తమకు ప్రమాదం పొంచి ఉన్నందున తమ ప్రాణాలను కాపాడాలని కోరారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరుగుతున్నాయని రాములు పేర్కొన్నారు. రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Discussion about this post