కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ జీతాలు పొందుతూ సోషల్ మీడియా ముసుగులో వైకాపా కోసం పని చేస్తున్నారు. మంగళవారం కళ్యాణదుర్గం పార్టీ కార్యాలయంలో వైకాపా సోషల్ మీడియా ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కుందుర్పి, తీగనల్లు, జంబుగుంపకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు వివిధ మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు, వలంటీర్లు పాల్గొనడం గమనార్హం. ప్రభుత్వ జీతాల్లో ఉంటూ ఏకకాలంలో పార్టీ కోసం పనిచేయడం, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు.
Discussion about this post