రెవిన్యూ ఉద్యోగులపై దాడి రోదనలు: మండల VRO ల నిరసన
చెన్నేకొత్తపల్లి వీఆర్వో లోకేష్ పై వైకాపా కార్యకర్త సోమశేఖర్ రెడ్డి దాడిని ఖండిస్తూ బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల వీఆర్వోలతో కలిసి తహసీల్దార్ షాబుద్దీన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.
తోటి సిబ్బంది చూస్తుండగానే సోమశేఖర్ రెడ్డి లోకేశ్‌పై అహంకారపూరితంగా దాడి చేసిన ఘటన ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉంది. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
దాడిని తీవ్రంగా ఖండించిన వీఆర్వో సంఘం జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనలో ఆర్‌ఐ శివారెడ్డి, వీఆర్‌వోలు వెంకటేష్, తులసమ్మ, మండల సర్వేయర్ సంతోష్‌లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post