ప్రఖ్యాతి గాంచిన నేమకల్లు ఆంజనేయస్వామి పుష్ప రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన దేవతను పట్టు వస్త్రాలు, ప్రత్యేక పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్ స్వామి నేతృత్వంలో అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, ఆకుపూజ, వెండి తమలపాకులతో అలంకరించడం, అర్చనలు, అభిషేకం వంటి పలు కార్యక్రమాలను నిర్వహించారు.
కర్ణాటక, ఆంధ్రా ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయారు. సాయంత్రం కాగానే మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు.
రాత్రి 7:30 గంటలకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ రామాంజినేయులు, సర్పంచ్ పరమేశ్వర, వైస్ ఎంపీపీ రమేష్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రశేఖరరెడ్డి, లోకేష్, ఆనందరెడ్డి, మనోహర్‌శెట్టి, రామకృష్ణ, వీరన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post