అనంతపురంలో, జేఎన్‌టీయూ క్యాంపస్ కాలేజీలో శనివారం జరిగిన 1979-83 బ్యాచ్ విద్యార్థుల రీయూనియన్‌లో పూర్వ విద్యార్థులే యూనివర్సిటీ బ్రాండ్ అంబాసిడర్‌లుగా పనిచేస్తున్నారని జేఎన్‌టీయూ (ఏ) వైస్-ఛాన్సలర్ డాక్టర్ జింకా రంగజనార్ధన ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ప్రసంగిస్తూ నేటి తరం విద్యార్థుల అభ్యున్నతి కోసం పూర్వ విద్యార్థులు సూచనలు, సలహాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో రెక్టార్ ఎం.విజయకుమార్, రిజిస్ట్రార్ సి.శశిధర్, ప్రిన్సిపాల్ ఎస్వీ సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు ప్రొఫెసర్ హెచ్.సుదర్శన్ రావు, ప్రొఫెసర్ ఆనందరావు, నారాయణరెడ్డి, టి.త్యాగరాజన్, వెంకటరామయ్య, సత్యనారాయణ, నారాయణరావు, పూర్వవిద్యార్థి డైరెక్టర్ పి.సుజాత, వైస్ ప్రిన్సిపాల్ ఇ.అరుణ కాంతి, ప్రొఫెసర్ వి.శంకర్, పాలకమండలి సభ్యులు డాక్టర్ ఎం. రామశేఖర్ రెడ్డి, అజిత.
Discussion about this post