నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) భారతదేశానికి చెందిన వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది 1939 లో నేతాజీ సుభాష్ చంద్రబోసు నేతృత్వంలోని భారత జాతీయ పార్టీలలో ఒక వర్గంగా ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా దాన్ని తిరిగి స్థాపించారు. ఈ పార్టీకి ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో బలమైన ఉనికి ఉంది. పార్టీ ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి సి. దేవరాజన్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి పీ.వీ. సుందరరామరాజు. స్వాతంత్ర్యానంతర కాలంలో, శరత్ చంద్రబోసు (సుభాష్ చంద్రబోసు సోదరుడు), చిత్త బసులు పార్టీ నాయకులుగా ప్రఖ్యాతి గాంచారు.
రానున్న 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో కుడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పలు నియోజకవర్గలలో గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా నేతాజీ గురించి అయన స్థాపించిన పార్టీ గురించి తెలియజేసీ ప్రజలను చైతన్య పరిచి వారి హక్కులను వారు తెలుసుకునే విదంగా. సింహం గుర్తుతో అభ్యర్థులను బరిలోకి దింపి పార్టీ ని బలోపేతం చేసి రాజకీయల పట్ల ఉత్సాహంగా ఉన్న యువతను ప్రోత్సహించి. ఇప్పటికె పలు జిల్లాలలో అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల లోపు పూర్తి వివరాలతో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బరిలోకి దిగడానికి సిద్ధం అవుతుంది. అందులో భాగంగా మొదటిగా (AIFB) ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి. అయిన నిడిమామిడి విష్ణు నారాయణ(ధర్మవరం విష్ణు) గారిని. ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది

Discussion about this post