తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టికెట్లు అమ్ముకుంటున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రాప్తాడులో సభ పెడతామని చెబుతున్నారు. వారిని స్వాగతిస్తున్నా. అయితే వచ్చే ముందు మీరు సీట్లు ఎంతకు అమ్ముకుంటున్నారో చెప్పండి. కళ్యాణదుర్గం టికెట్‌ను ఎంతకు అమ్ముకున్నారు, అనంతపురం, గుంతకల్లు, దర్మవరం టికెట్లు ఎంత బేరం పెట్టారో చెప్పండి. చంద్రబాబు టికెట్లు అమ్ముకుని టికానా ఎత్తేసేందుకు సిద్దంగా ఉన్నాడు. ఫేక్ సర్వేలతో డిమాండ్ సృష్టించి ఒక్కో సీటును 50, 100 కోట్లకు అమ్ముకుంటున్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు టికెట్ల కోసం ఆశించి భంగపడ్డారు. వారి నిరసనల మధ్య సభ పెడతారా?.
👉 గతంలో చంద్రబాబు ఆత్మకూరు పర్యటనకు వచ్చినప్పుడు నాపై 2 వేల కోట్లు ఆస్తులు సంపాదించానని ఆరోపణలు చేశాడు. దీనిపై ఇప్పటికీ నిరూపించలేకపోయాడు. ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికైనా చెప్పి సభ పెట్టండి. ఇక ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ టీవీలు, పేపర్లలో 500 కోట్లకు వచ్చారు. ఐదేళ్లలో 500 కోట్లు అక్రమంగా సంపాదించానంటూ నిరాధరమైన కథనాలు వండారు. ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా.. నాకు 50 కోట్లు ఇస్తే నాతో పాటు మాకుటుంబ సభ్యులంతా ఎక్కడ సంతకాలు పెట్టమన్నా పెడతాం. మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే పెడతా… ఆ 500 కోట్లు మా నియోజకవర్గంలోని ప్రజలకు పంచండి. చంద్రబాబు ఈనెల 4న రాప్తాడుకు వస్తున్నాడు. అదేరోజు ఒక్కో కుటుంబానికి 50 వేలు చొప్పున లక్ష కుటుంబాలకు పంచిపెట్టండి. నిరూపించలేకపోతే చంద్రబాబు, రామోజీరావు రాధాకృష్ణ మీ ఆస్తులు పంచడానికి సిద్ధమా?. లేదా చర్చలకు సిద్ధమా.
👉ఈనాడు రామోజీ సైకిల్‌లో పచ్చళ్లు అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించాడు. వ్యవస్థలను మార్చేస్థాయికి ఎలా వెళ్లాడు. చంద్రబాబు కేవలం రెండు ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎలా సంపాదించాడు. నాపై తప్పుడు కథనాలు రాసిన, ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు, టీవీలను కోర్టుకు ఈడుస్తా.
👉రాప్తాడులో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థిలేడు. స్వయానా చంద్రబాబు వచ్చి పోటీ చేసినా గెలవడు. కాబట్టే నాపై వ్యక్తిత్వ హరణానికి దిగుతున్నారు. వాళ్లు బరిలో నిలవాలంటే నన్ను దుర్మార్గంగా చిత్రీకరించాలి. లేదా నన్ను చంపాలి. ఈ క్రమంలో నాపై పదేపదే వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారు.
👉పవన్ కళ్యాణ్‌ను ఎవరూ లీడర్ అనుకోవడం లేదు. ప్యాకేజీ ముట్టనంత వరకూ కథలు చెబుతాడు, ప్యాకేజీ ముట్టగానే జగన్‌ను తిడతాడు. ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలీదు. నాకు ముగ్గురు పెళ్లాలు అంటున్నారు. నాల్గో పెళ్లాం జగన్ అని అంటున్నాడు. నువ్వేమైనా ‘గే’నా పవన్. ఎక్కడైనా చూపించుకోవచ్చుకదా? ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ మాటంటే చేగువీరా అంటావు. భగత్‌సింగ్ అంటావు. పరిజ్ఞానం ఉందా? నీకేమైనా విజిన్ ఉందా?. బానిసగా బతకాలి. నువ్వు ఎవడికి టికెట్లు ఇస్తే వాడికి ఓటు వేయాలని అడుగుతున్నావు అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు

Discussion about this post