గోరంట్ల పట్టణం లో నాలుగో వార్డు లో మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు, మైనార్టీ నాయకులు నూరు మహమ్మద్ మరియు మండల కో ఆప్షన్ సభ్యులు భాష ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం జోరందు కున్నది. ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్నా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ భర్త చరణ్ రెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి గడపగడపకు వెళ్లి కరపత్రాలు అందజేస్తూ మరోమారు జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి చేయమని అలాగే పెనుగొండ శాసన సభ్యురాలిగా మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్ ని గెలిపించమని ప్రజలకు మైనారిటీ నాయకులకు వేడుకున్నారు. అనంతరం వైసీపీ నాయకులు ఆయనకు శాలువా పూలమాలలతో బాణాసంచా పేల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు వివరించారు. మీ ఇంటి ఆడబిడ్డ ఉషశ్రీ చరణ్ ను ఆదరించి ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో పెనుగొండ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఉషశ్రీ చరణ్ ను గెలిపించాలని ఆయన కోరారు.
Discussion about this post