జిల్లాలో 9,343 మందికి సన్మానం
31 సేవా వజ్ర, 187 సేవా రత్న,
9,125 సేవా మిత్ర అవార్డులు
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంక్షేమ వారధులుగా నిలుస్తున్న వలంటీర్ల సేవలకు సర్కార్ గుర్తింపు ఇస్తోంది. సేవలకు మెచ్చి ఏటా సన్మానం చేస్తోంది. తాజాగా ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు ఈ నెల 15వ తేదీన పురస్కారాలు అందజేసేందుకు సిద్ధమైంది.
సేవా వజ్రలకు రూ.30 వేల నగదు బహుమతి
జిల్లాలో జిల్లాలో 9,343 మంది గ్రామ/వార్డు వలంటీర్లు పని చేస్తున్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించేందుకు సిద్ధమైన ప్రభుత్వం సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్రగా మూడు క్యాటగిరీలుగా విభజించింది. ఈమేరకు అధికారులు 31 మందిని సేవావజ్రకు, 187 మందిని సేవారత్నకు, 9125 మందిని సేవా మిత్ర అవార్డులకు ఎంపిక చేశారు. వీరికి ప్రశంసాపత్రంతో పాటు పతకాలు అందజేయనున్నారు. సేవా వజ్రకు రూ.30 వేలు, సేవా రత్నకు రూ.20 వేలు, సేవా మిత్రకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు. ఈ ఏడాది పనితీరు ఆధారంగా ప్రభుత్వం కొంతమంది వలంటీర్లకు ప్రత్యేక బహుమతులు అందజేయనుంది. ఇలా ఎంపికై న వారికి అదనంగా మండల, మున్సిపాలిటీ స్థాయిలో రూ.15 వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు, జిల్లా స్థాయిలో రూ.25 వేలు అందజేయనున్నారు.
source : sakshi.com
Discussion about this post