పవన్ కల్యాణ్ తీరుపై హరిరామ జోగయ్య అసంతృప్తి
ఎవరిని ఎవరికి తాకట్టు పెడుతున్నారు?
ఇంకెన్నాళ్లు యాచిస్తారు? శాసించే స్థితికి ఎప్పుడు చేరతారు?
కాపు సామాజిక వర్గానికి ఏమని సమాధానం చెబుతారు?
ఎన్నాళ్లని కాపులు పిచ్చి నమ్మకంతో మీ చుట్టూ తిరగాలి?
చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ పై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామ జోగయ్య స్పందించారు. ఈ మేరకు పవన్‌కు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ మరో లేఖ రాశారు. చంద్రబాబు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని.. రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.
source : sakshi.com
Discussion about this post