ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి రాప్తాడులో ఈ నెల 10న నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. బహిరంగ సభ కోసం ఆదివారం సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్/ ఎమ్మెల్సీ తలశిల రఘురాం.. ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త శాంత, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యతో కలిసి స్థల పరిశీలన చేశారు. రాప్తాడులోని ఆటో నగర్ సమీపాన స్థలాన్ని, రామినేపల్లి సమీపంలోని ఎంఐజీ లేఅవుట్‌ను, ప్రసన్నాయపల్లి సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్‌రెడ్డి, అనంతపురం జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైపూల్లా బేగ్, పార్టీ మండల కన్వీనర్ జూటూరు శేఖర్, నాయకుడు చిట్రా వెంకటేష్ పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post