చంద్రబాబు ఎంతసేపూ జగన్‌ను, ఆయన వెనుకున్న మాలాంటి సైనికులపై దుమ్మెత్తి పోయడంతప్ప ఏమీ చేయలేడని మంత్రి ఆర్.కె.రోజా విమర్శించారు. తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాలులో జరిగిన సమావేశానికి హాజరైన ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఏమిచేశాను, ఏమి చేస్తాను అని చెప్పలేని చంద్రబాబు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నాడన్నారు. ఆయన కుమారుడు లోకేశ్ చేతకానివాడని, దత్తపుత్రుడు ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో తెలియదని, ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిలా షర్మిలను దింపారని ఆరోపించారు. ఆమె ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన, రాజశేఖర్‌రెడ్డిని అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడం తగదన్నారు. స్వలాభం కోసం జగన్‌పై విషం చిమ్ముతున్నారన్నారు.
source : eenadu.net
Discussion about this post