పమిడి:
ద్విచక్ర వాహనం ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పామిడి మండలం పాళ్యం తండాకు చెందిన ఆర్.లక్ష్మణనాయక్ కుమారుడు రాముడు నాయక్(47), లలితమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇటీవల విక్రయించిన వేరుశనగ పంటకు సంబంధించి డబ్బులు వసూలు చేసేందుకు గార్లదిన్నె మండలం కల్లూరుకు బుధవారం సాయంత్రం వెళ్లాడు. డబ్బులు వసూలు చేసి గురువారం ఉదయం టీవీఎస్ మోపెడ్‌పై స్వగ్రామానికి చేరుకున్నాడు.
44వ జాతీయ రహదారిపై పామిడి వద్దకు రాగానే వేగాన్ని అదుపు చేయలేక ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కూడేరు:
షార్ట్ సర్క్యూట్ కారణంగా బొలెరో వాహనం దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం శివరాంపేటకు చెందిన బోయ రాజేంద్ర మరో ఆరుగురితో కలిసి బొలెరో వాహనంలో వజ్రకరూరు మండలం కడమలకుంటలోని సుంకులమ్మ ఆలయానికి వెళ్లాడు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం గురువారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకున్నారు.
ఇంటి వద్ద వాహనం ఆపి ఉండగా లోపల మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రాజేంద్ర, అతని కుటుంబసభ్యులు వెంటనే వాహనం నుంచి కిందకు దిగారు. మంటలు ఆర్పేలోపే వాహనం లోపలి భాగం పూర్తిగా దగ్ధమైంది.
Discussion about this post