రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజున ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ముగిశాక.. శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ అయి సమావేశాల ఎజెండాను ఖరారు చేయనుంది. సభను మూడు రోజులపాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మరికొన్ని రోజులు సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్ష తెదేపా కోరితే.. మరో రెండు రోజులపాటు సభ నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 6వ తేదీ మంగళవారం కావడంతో 7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత 15వ శాసనసభకు ఇవి 12వ, చివరి సమావేశాలు కావడం గమనార్హం.
source : eenadu.net
Discussion about this post