ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ విద్యా సంస్థకు మొత్తం చెల్లించాం. ఇప్పుడు పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. తగు చర్యలు తీసుకుని తమ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని డీడీ అభ్యర్థులు కలెక్టర్ గౌతమికి మొర పెట్టుకున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆ విద్యా సంస్థకు మొత్తం చెల్లించాం. ఇప్పుడు పాస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు.
తగు చర్యలు తీసుకుని తమ ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని డీడీ అభ్యర్థులు కలెక్టర్ గౌతమికి మొర పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో స్పందన కార్యక్రమం జరిగింది.
కలెక్టర్‌తో పాటు జేసీ కేతంనగర్, డీఆర్‌వో గాయత్రీదేవి, స్పెషల్ సబ్ కలెక్టర్లు ఆనంద్, సుధారాణి, ఆర్‌డీఓ వెంకటేశులు, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి తదితరులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు.
మొత్తం 437 మంది అర్జీలు సమర్పించారు. అనంతరం జిల్లా అధికారులతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో డీడీ అభ్యర్థులు తమ బాధలను కలెక్టర్ కు తెలిపారు. 2020-22 విద్యా సంవత్సరంలో విజయభారతి డి.డి.లో కోర్సు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.
బీకే సముద్రం సెంటర్‌లోని కళాశాలలో 63 మంది విద్యార్థులు ఉన్నారు. జనవరిలో పరీక్షలు పూర్తి కాగా రెండు నెలల క్రితమే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు వచ్చినా ఇవ్వలేదని వాపోయారు.
రీసర్వేలో గందరగోళం:
యాడికి మండలం పుప్పాల గ్రామానికి చెందిన 11 మంది రైతులు అక్కడి సర్వేయర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆరు సర్వే నంబర్లలో 40 ఎకరాల భూమిని రీసర్వే చేశారు. కానీ, హద్దురాళ్లు పాతడం లేదని అంటున్నారు.
అనంతలో నివాసముంటున్న ఓ మహిళ తనకు ఎకరంన్నర ఉందని చెప్పడంతో మధ్యలో రీసర్వే ఆగిపోయిందన్నారు. రీసర్వేలో గందరగోళం నెలకొందని ఫిర్యాదు చేశారు.
Discussion about this post