ముఖ్యమంత్రి జగన్ 30 కి.మీ. ప్రయాణించడానికి హెలికాప్టర్‌ను ఉపయోగించనుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం గురువారం ఉదయం హాజరు కానున్నారు. ఓర్వకల్లు విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి కోడుమూరు రోడ్డులోని వివాహ వేదికకు సుమారు 30 కి.మీ. దూరం ఆయన ప్రయాణించాలి. విమానాశ్రయం నుంచి బళ్లారి చౌరస్తా వరకు నాలుగు వరుసల రహదారి, అక్కడి నుంచి వివాహ వేదికకు రాష్ట్ర రహదారి ఉన్నాయి. రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి 30 నిమిషాల్లోపే వివాహ వేదిక వద్దకు చేరుకోవచ్చు. అయినప్పటికీ సీఎం ప్రయాణించడానికి సుమారు 200 కి.మీ. నుంచి అధికారులు హెలికాప్టర్‌ను తెప్పించడం గమనార్హం.
source : eenadu.net
Discussion about this post