హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీ నందు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సీడ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ లక్ష్యం అంత్యోదయ చిట్టచివరి మనిషికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో పని చేస్తుందన్నారు అందులో భాగంగానే పేదలకు ఇల్లు, మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, అందరికీ ఆరోగ్యం ఉండాలని ఆయుష్మాన్ భారత్,మరియు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా బియ్యం, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులకు అనేక పథకాలు ఇలా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఒకటే నాలుగు వర్గాల వారికి లబ్ధి చేకూరితే దేశం బాగుపడుతుందని వారిలో మొదటిది దేశంలోని యువతకు,మహిళలకు, రైతులకు,మరియు పేదలకు ఈ నాలుగు వర్గాల వారిని అభివృద్ధిలోకి తెస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారుతుందని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన మెప్మా డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి, మహిళా మార్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజారెడ్డి, గీత సెల్ జిల్లా కన్వీనర్ శ్రీరాములు,పట్టణ అధ్యక్షులు నగేష్, సీనియర్ నాయకులు డాలేశ్వర్, హౌసింగ్ మణిరాజ్, మెప్మా డిపార్ట్మెంట్ నాగేంద్ర, హరి, నర్మదా, శివ జ్యోతి, వరలక్ష్మి,సాధిక,అలివేలు, నాగలక్ష్మి, స్వప్న, సచివాలయం సిబ్బంది జనార్ధన్, లోకేష్, శిల్ప, వరలక్ష్మి, త్రివేణి, ఎర్రమ్మ, ప్రభావతి, గౌతమి, రమేష్,నరసింహమూర్తి,శివప్ప, రమేష్,బీజేవైఎం పట్టణ అధ్యక్షులు జయకృష్ణ,వినయ్, కార్తీక్,సాయి, మంజు, మరియు అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ వారు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



Discussion about this post