గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కొత్తచెరువులోని ఒకటో గ్రామ సచివాలయం కార్యాలయం వద్ద జాతీయ పతాకానికి బదులు.. వైకాపా జెండా రెపరెపలాడింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించకపోవడం.. ఆవరణంలో వైకాపా జెండా కనిపించడం పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ దృశ్యాన్ని కొందరు ఫొటో తీయడంతో మేల్కొన్న సిబ్బంది హడావుడిగా మధ్యాహ్నం గ్రామ సచివాలయం కార్యాలయ భవనంపై బల్బు (లైట్) పైపునకు చిన్న జాతీయ పతాకాన్ని కట్టి.. ఆవిష్కరించినట్లు చేసి.. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించకుండా మధ్నాహ్నం అక్కడ ఏర్పాటు చేయడంతో స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి.
source : eenadu.net
Discussion about this post