సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలను శుక్రవారం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం జిల్లా పరిధిలోని రెండు నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించింది. ఈమేరకు చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం(ఎస్సీ) సమన్వయకర్తగా ఎంపీ రెడ్డప్ప, జీడీనెల్లూరు(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు పేర్కొంది. పార్టీ ప్రకటనపై సర్వత్రా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప స్పందిస్తూ ముఖ్యమంత్రి జగనన్న, మంత్రి పెద్దిరెడ్డి అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని వెల్లడించారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
source : sakshi.com
Discussion about this post