టీడీపీ కాపునేత, కాణిపాకం ఆలయ మాజీ ట్రస్టు బోర్డు సభ్యుడు అప్పోజీ వైఎస్సార్ సీపీలోకి చేరారు. కాపులంతా వైఎస్సార్‌సీపీలో ఉంటామన్నారు. నగరంలోని సంతపేటలో ఏర్పాటు చేసిన సభలో వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి 50 కుటుంబాలకు చెందిన వారిని పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. విజన్ ఉన్న నాయకుడు అప్పోజీ అని, సంతపేట డివిజన్‌పై తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్థానికంగా మహిళ సమాఖ్య భవనం అవసరమని సమాఖ్య నాయకురాలు కామాక్షి కోరారు. తక్షణం అప్పోజి రూ.50 వేలు, వివేకానంద రవి తరపున రూ.20 వేలు, కామాక్షి రూ.25 వేలును విజయానందరెడ్డి చేతుల మీదుగా సమాఖ్య సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం తరుపున సమాఖ్య భవన నిర్మాణం చేయిస్తామని ఆయన హామీనిచ్చారు. పార్టీలో చేరినవారిలో బాబు, ఢిల్లీకుమార్, నాగరాజు, భాస్కర్, కుమరేష్, లోకేష్, బ్యాంకు మురళీ, బ్యాంకు సురేష్, వెంకటరత్నం, మది, మారి, అలగన్, పయణి, సీఎస్ రెడ్డి, ఆనంద్ ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షుడు పుల్లికల్లు రవీంద్రనాథరెడ్డి, లీగల్ నాయకులు కన్న, డిప్యూటీ మేయర్ రాజేష్‌కుమార్‌రెడ్డి, నాయకులు నారాయణ, శీన, దివాకర్, నేతాజీ, చిన్నయ్యనాయుడు, ద్వారక, అగస్తీశ్వర ఆలయ ఛైర్మన్ శివ తదితరులు పాల్గొన్నారు.
source : sakshi.com
Discussion about this post