ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. మంగళవారం విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్, పరిటాల సునీత కలిశారు. ఇరువురికి బీఫాం పత్రాలను చంద్రబాబు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నామని, ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలంతా కలిసి పని చేయండి. కూటమిని గెలిపించి, మీరంతా మళ్లీ విజయంతో తిరిగి రావాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post