సీఎం జగన్ ఈ నెల 13న (మంగళవారం) విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 5:20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్‌లో మధురవాడ ఐటీ హిల్-3కి చేరుకుంటారు. అక్కడి నుంచి పీఎం పాలెం ఏసీఏ, వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట స్టేడియంకు వెళతారు. రాత్రి 8 గంటల వరకు అక్కడ జరిగే రాష్ట్ర స్థాయి ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, జ్ఞాపికలు అందజేస్తారు. రాత్రి 8:05 గంటలకు స్టేడియం నుంచి విమానాశ్రయానికి వెళతారు. అక్కడి నుంచి విమానంలో బయల్దేరి రాత్రి 9:30 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
source : eenadu.net
Discussion about this post