‘గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో ఊరూరా స్పష్టంగా కనిపిస్తోంది. విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో ఓటు వేసేది కేవలం ఎంపీ, ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. జరుగుతున్న మార్పును కొనసాగించేందుకే అన్నది ప్రధానం. ఈ మార్పులు కొనసాగితేనే పేదవాడి బతుకులు మారతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనుకుంటేనే మీ బిడ్డకు అండగా నిలిచి ఓటు వేయాలని కోరుతున్నా. జరిగిన మేలును ఇంటింటా చెప్పాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర నాలుగో రోజు శనివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లాలోనూ కొనసాగింది. తుగ్గలిలో తుగ్గలి, రాతన గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం అందించిన సంక్షేమాభివృద్ధిపై రెండు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ఆశీస్సులు తెలిపారు. ‘మళ్లీ ముఖ్యమంత్రిగా నువ్వే రావాలన్నా.. మళ్లీ సీఎంగా ఇక్కడికి రావాలి’ అంటూ మహిళలు, రైతులు, విద్యార్థులు హర్షధ్వానాల మధ్య మూకుమ్మడిగా నినదించారు. ‘రెండు గ్రామాల పరిధిలో 10 వేల జనాభా ఉన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఏకమయ్యారు. అందరినీ ఒకటే కోరుతున్నా. ఇంతకు ముందు ప్రభుత్వాలను చూశారు.
ఇవాళ మన ప్రభుత్వాన్నీ చూస్తున్నారు. మీరు ఇంతకు ముందు చూడని విధంగా మన ప్రభుత్వ హయాంలోని 58 నెలల్లో ప్రస్ఫుటమైన మార్పులు కన్పింస్తున్నాయి. ఇలాంటి విప్లవాత్మక మార్పులు గత ప్రభుత్వాల్లో ఎందుకు కన్పింంచలేదు? తుగ్గలి, రాతన సచివాలయ పరిధిలోని గ్రామాల్లో కూడా గొప్ప మార్పు కన్పింస్తుండటం పట్ల ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని సీఎం కోరారు.
source : sakshi.com
Discussion about this post