మాట చెప్పి మడమతిప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం… తొమ్మిది గంటలు రైతులకు న్యాయమైన కరెంటు ఇస్తానని చెప్పి, మాట తప్పడమే కాకుండా కరెంట్ చార్జీలు బాదుడే-బాదుడు పేరిట ప్రజలకు భారం మోపారు. ధర్మవరం నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా విషయంలో కేతిరెడ్డికి కంకర మిషన్ కి ఒక న్యాయం?? ప్రజలకు ఒక న్యాయం ఉంటుందా ??విద్యుత్ డిమాండ్ ఎక్కువైతే వోల్టేజ్ సామర్థ్యం పెంచాలి, రైతులకు అండగా ఉండాలి,., పంటలను కాపాడండి ధర్మవరం రైతాంగాన్ని ఆదుకోండి… ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ,కరెంటు కష్టాలను తొలగించి ..వేసిన పంటలను కాపాడాలని, రైతాంగo కోరుతోంది
రైతుల పక్షాన భాజపా నాయకులు,,, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు గోనుగుంట్ల సూర్యనారాయణ గారి బృందం నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్ల వద్ద విద్యుత్ శాఖ ఇంజనీర్లకు అవినీతి పత్రాలు సమర్పించారు …ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్ కోతలతో- పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని… దాంతో రైతాంగం ఆందోళన చెందుతుందని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు .గతంలో ఎప్పుడూ లేనివిధంగా కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు
ఎడా పెడ కరెంటు కోతలు విధిస్తుండడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు రైతుల ఆందోళనను అర్థం చేసుకొని నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి రైతుల పంటలను కాపాడాలని బత్తలపల్లి ముదిగుబ్బ తాడిమర్రి ధర్మవరం మండల విద్యుత్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించారు

Discussion about this post