మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్న సభలో గిరిజన సర్పంచికి అవమానం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీలో పలు అభివృద్ధి పనులను, కొత్తగా నిర్మించిన భవనాలను మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించారు. ఏ హోదా లేని వైకాపా కార్యకర్తలను వేదికపై కూర్చోబెట్టగా, స్థానిక సర్పంచి చలంచర్ల సురేశ్‌ను మాత్రం ఆహ్వానించలేదు. కొందరి ప్రసంగాలు ముగిశాక ఈ తప్పిదాన్ని గుర్తించి వేదికపై పిలిచినప్పటికీ ప్రసంగించే అవకాశం ఇవ్వలేదు. గ్రామంలో అధికారిక కార్యక్రమానికి సర్పంచి అధ్యక్షత వహించాల్సి ఉండగా, కనీస ప్రొటోకాల్ పాటించలేదు.
source : eenadu.net
Discussion about this post