‘మేమేం పార్టీకి ద్రోహం చేయలేదు… నష్టమూ చేయలేదు. ఇన్నేళ్లు పార్టీ కార్యకర్తలను అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చాం. అలాంటిది పార్టీలో మాకే విలువ లేకుండా చేస్తారా? అసలు నీతో మాకేటి? తాడోపేడో చంద్రబాబుతోనే తేల్చుకుంటాం’ అంటూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఝలక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం యర్రంపల్లికి చేరుకున్న సురేంద్రబాబు… నేరుగా ఉన్నం హనుమంతరాయ చౌదరిని ఆయన ఇంటి వద్దనే కలిశారు. ఊహించని ఈ పరిణామంతో ఉన్నం ఒకింత అసహనానికి గురయ్యారు. అయినా సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని సురేంద్ర కోరారు. ఆ సమయంలో ఉన్నం మాట్లాడుతూ.. తామేమి తప్పు చేశామో చెప్పకుండా టికెట్ నిరాకరించిన అంశంపై నేరుగా చంద్రబాబుతోనే తేల్చుకుంటామని, ఆ తర్వాతే తమ నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీంతో అమిలినేని నిరాశతో వెనుదిరిగారు.
source : sakshi.com
Discussion about this post