రాష్ట్రవ్యాప్తంగా బైబై బాబూ..! అంటూ బీసీలు ‘‘సిద్ధం’’ అవుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా తమను సామాజికంగా, రాజకీయంగా అక్కున చేర్చుకున్న వైఎస్సార్ సీపీ వెంట బీసీలు నడుస్తున్నారు. బలహీన వర్గాలు అత్యధికంగా ఉండే అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ తాజాగా నిర్వహించిన సిద్ధం సభకు తరలివచ్చిన జనసందోహమే అందుకు నిదర్శమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల గడ్డ కుప్పంలో సైతం వలస నేత చంద్రబాబును తరిమేందుకు బలహీన వర్గాలు సిద్ధం కావడంతో సొంత సామాజిక వర్గాన్ని శరణు వేడుతూ చంద్రబాబు పక్క చూపులు చూడటాన్ని ఉదహరిస్తున్నారు.
టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లె వేస్తూ రాజకీయ అవసరాలు తీరాక ఆ వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు బీసీలకు ఇచ్చిన హామీల కంటే మిన్నగా గత 58 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయం చేయడంతో ఆ వర్గాలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తున్నాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి విజయవంతం కావడంతో ఇది ప్రస్ఫుటితమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
source : sakshi.com
Discussion about this post