ఆత్మకూరు మండలం సింగంపల్లి, సింగంపల్లి తండా, వై.కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు, ఎమ్మెల్సీ మంగమ్మ గారు, జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు..!
●సంక్షేమ సారథి జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలి..!
●పరిటాల సునీత పదేళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి చేయలేని అభివృద్ధి మన ప్రభుత్వంలో చేసి చూపించాం
●పెద్ద మనసుతో మరోమారు ఆశీర్వదించాలని కోరిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు..
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆత్మకూరు మండలం సింగంపల్లి, సింగంపల్లి తండా, వై.కొత్తపల్లి గ్రామాల్లో ప్రచారం చేపట్టగా ప్రజలు అడుగడుగునా అపూర్వస్వాగతం పలికారు. ‘జైజగన్…జైజై జగన్’, ‘తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో పరిటాల సునీత పదేళ్ల పాటు ఈ ప్రాంతానికి పరిటాల సునీత ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసినా ఒరిగిందేమీ లేదు. మీ అందరి ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో నేను గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా 17 వేల ఇళ్లను మంజూరు చేయించా. ఇవికాకుండా కేంద్ర ప్రభుత్వం మరో 7 వేల ఇళ్లను మంజూరు చేసింది. అంటే ఒక్కసారి ఫ్యాను గుర్తుకు ఓటు వేసినందుకు 24 వేల ఇళ్లను తీసుకొచ్చాం. 2 వేలమంది పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించాం. 4 వేలమంది మహిళలకు ఉపాధి కోసం గార్మెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 11.50 ఎకరాల భూములు కేటాయించాం. ఆర్నెళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయి. నియోజకవర్గంలోని పాడి మహిళా రైతులకు అండగా నిలబడేందుకు 20 కోట్లు సొంత డబ్బులు ఖర్చు చేసి అమ్మ డెయిరీని ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈనెల 8న మంత్రి రోజా చేతుల మీదుగా 8 వేలమంది మహిళా పాడి రైతులకు ఈ ఆస్తి అందించబోతున్నాం.రాప్తాడు నియోజకవర్గంలో 50 వేల పింఛన్లు ఇస్తున్నాం. ఆసరా, అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా, రైతులకు సున్నావడ్డీ, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ తదితర అనేక పథకాలు ఇచ్చారు. రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటిపట్టాలు ఇచ్చారు. 20 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నారు. 127 సార్టు బటన్ నొక్కి 2 లక్షల 57 వేల కోట్ల రూపాయలు పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరి 127 సార్లు మన కోసం బటన్ నొక్కిన జగనన్న కోసం వచ్చే ఎన్నికల్లో ఎంపీకి సంబంధించి ఫ్యాన్ గుర్తుపై ఒకసారి, ఎమ్మెల్యేకు సంబంధించి ఫ్యాన్ గుర్తుపై రెండోసారి బటన్ నొక్కలేమా?. ఫ్యాన్ గాలికి ప్రతిపక్షాల అభ్యర్థులు లేచిపోవాలి. జగనన్న పరిపాలన జనరంజకంగా ఉంటుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మా ఇద్దరి ఆశీర్వదించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు

Discussion about this post