జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. గురువారం ఉదయం నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు అందజేశారు. జిల్లాలో 2,90,854 మంది పింఛన్‌దారులు ఉండగా, తొలి రోజే 2,40,757 మందికి అందజేసి 83 శాతం మేర పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 1,47,145 ఉండగా, వితంతు 66,997, దివ్యాంగులు 46,817, చేనేత కార్మికులు 6,834, ఒంటరి మహిళలు 6,764, అభయ హస్తం 4,285, డప్పు కళాకారులు 3,161, మెడికల్ 3,296, చర్మకారులు 3,539, మత్స్యకారులు 892, గీత కార్మికులు 358, ట్రాన్స్‌జెండర్ 210, కళాకారులు 189, సైనిక సంక్షేమం 6, డయాలసిస్ పేటెంట్లు 363 మందికి పింఛన్ అందజేస్తున్నారు.
source : sakshi.com
Discussion about this post