ఆ. ప్ర. ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు K.B.శంకరయ్య గారి ఆధ్వర్యంలో 06/03/2024 నాడు లేపాక్షి మండల తాహిసీల్దార్ గారికి లేపాక్షి మండలం పులమితి పంచాయితీ లో 2001 సం” లో ఎరుకల కులస్థులకు నివాస గృహ శాశ్వత పట్టాలు మంజూరు చేసినారు దాదాపుగా అన్ని వర్గాలు BC, SC, ST వర్గాల వారికి సర్వే నెంబర్ 19/6 A లో శాశ్వత గృహ పట్టాలు ఇస్థు రాబోవు కాలములో ఈ కాలనీకీ సంబంధించి రెవిన్యూ అధికారులు వారి అవసరాలు కొరకు అంటే ఆ కాలనీ లో దేవాలయాలు, అంగన్వాడి కార్యాలయాలు, పాఠశాలలు, ఆట స్థలము వగైరావి ఏర్పాటు చేయాడానికి ఆ కాలనీకీ సౌకర్యాలు కల్పించడం కోసం కొంచెం స్థలం వదిలినారు కాని ఆ కాళీ స్థలం కాజేయడం కోసం కొంతమంది స్వార్థపారులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ మిగులు భూమి ని స్వాదిన పరచుకొనే ఉద్దేశం తో ఆ భూమిని చదును చేసి విక్రయించాలి అనే దురుద్దేశం తో ఆ కాళీ స్థలం లోకి ప్రవేశించి పట్టాలు పొందిన SC, ST, BC వర్గాల ప్రజలను బయబ్రాంతులకు గురించేస్తుంటే బాధితులు ఆ. ప్ర. ఎరుకల హక్కుల పరిరక్షణ సమితికి నాయకులకు పీర్యాదు చేయగా ఆ విషయాన్ని లేపాక్షి మండల తహిసల్దార్ పీర్యాదు చేసి పట్టాదారులకు ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తి మీద రెవిన్యూ పరంగా చర్యలు మరియు చట్టపరమైన చర్యలు తీసుకోని బాధితులకు రక్షణ కల్పించాలని ఆ. ప్ర. ఎరుకల హక్కుల పరిరక్షణ సమితి తరుపున పీర్యాదు చేయడజరిగింది.

Discussion about this post