ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన బంగి మల్లేష్..!
రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం తూముచెర్ల సర్పంచ్ బంగి మల్లేష్ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పని చేస్తున్న బంగి మల్లేష్… అపార్టీ విధానాలు, పరిటాల కుటుంబ వైఖరి నచ్చక పార్టీని వీడారు. శనివారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని బంగి మల్లేష్ అన్నారు.

Discussion about this post