టిడిపి తో పొత్తు , 24 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడం ఫై జనసేన నేతలు పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేత హైపర్ ఆది స్పందించారు. ‘ఒక నిజమైన జనసైనికుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడావ్ ఆది’ అని నాగబాబు ఆ వీడియోను షేర్ చేశారు. ‘ఎక్కువ సీట్లు తీసుకుని ఇన్నే గెలిచాడా? అనిపించుకోవడం కంటే.. తక్కువ సీట్లు తీసుకుని అన్నీ గెలిచాడు అనిపించుకోవడం కరెక్ట్ అని భావించి పవన్ 24 సీట్లకే పరిమితమయ్యారు’ అని ఆది తెలిపారు.
పార్టీని అభిమానించేవాళ్లే ఇంత ఆలోచిస్తుంటే, పార్టీని స్థాపించిన వాడు, పార్టీని పదేళ్లుగా నడుపుతున్నవాడూ ఇంకెంత ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడో ఒక్కసారి గుర్తెరగమని జనసైనికులకు హితవు పలికాడు హైపర్ ఆది. ఈ సందర్భంగా పవన్‌ని ధోనీతో పోల్చాడు హైపర్. ధోనీ కూడా తన తొలి వన్డేలో డకౌట్ అయ్యాడని, ఆ తరవాత క్రమంగా నిలదొక్కుకొని, క్రికెట్ నే శాశించే స్థాయికి ఎదిగాడని, పవన్ కూడా తొలిసారి ఓడిపోయాడని, ఇప్పుడు 24 సీట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టి, రాజకీయాలకే తలమానికంగా ఎదుగుతాడని జోస్యం చెప్పాడు. ప్రతిపక్షంలో ఉంటూ, జనం కోసం జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతున్న ఏకైక నాయకుడు పవన్ కల్యాణ్ అనీ, పిల్లల కోసం దాచుకొన్న డబ్బులు సైతం ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడని, పార్టీని పదేళ్లుగా నడుపుతున్నాడని, ఆయన ఏ నిర్ణయం తీసుకొన్నా, అభిమానులు, జనసైనికులు వెంట ఉండాలని, అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలా, నచ్చని పని చేసినప్పుడు మరోలా మారడం అభిమానం అనిపించుకోదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.
source : vartha.com
Discussion about this post