ఏపీ ప్రజలు జగన్‌ను ఓడించేందుకు లక్ష కారణాలు ఉన్నాయని, 99 శాతం హామీలను నెరవేర్చని అసమర్థ ముఖ్యమంత్రిని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు… మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను తీసిన ఘనత సీఎం జగన్ కే దక్కింది. 5ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి రూ. 64 వేల కోట్ల భారం మోపి, పేదల నడ్డి విరిచిన జగన్ రెడ్డిని గద్దె దించితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని. ఏపీ ప్రజలు ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. వైసీపీని గద్దె దించి ప్రజా పాలన తెచ్చుకునే సమయం వచ్చేసింది. టీడీపీ కూటమిని గెలిపించుకుందాం, మళ్లీ ప్రజా పాలనను తెచ్చుకుందాం అని టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత తెలిపారు

Discussion about this post