మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో ‘రా కదలిరా’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన పొగిడారు. ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు సీఎం జగనేనని ఆలపాటి అన్నారు. దీంతో సభతో పాటు ఒక్కసారిగా చంద్రబాబు అవాక్కయ్యారు.
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా.. కదలి రా.. సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడితో పార్టీ నాయకులు శ్రమిస్తున్నా.. ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. ఫలితంగా సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో జరిగిన సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఈ రెండు సభలకు కలిపి మూడు లక్షల మంది జనాన్ని సమీకరించాలని పార్టీ నాయకులు యత్నించినా వారి ఆశలు ఫలించలేదు. 30 వేలమందికి మించి జనం రాలేదని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కున్నాయి. ఫలితంగా ఖాళీ కుర్చిలకే చంద్రబాబు ప్రసంగం పరిమితమైంది. వచ్చిన వారూ బాబు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జారుకోవడం గమనార్హం.
source : sakshi.com
Discussion about this post