ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో క్రైస్తవులందరినీ నట్టేట ముంచారని క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ ఆరోపించారు. మంగళవారం తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 75 వేల మంది పాస్టర్లు ఉంటే 10 శాతం మందికి మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారన్నారు. గత ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గంలోని చర్చిల నిర్మాణానికి రూ.5 లక్షలు చొప్పున ఇస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని విమర్శించారు. కల్లిబొల్లి మాటలతో సీఎం క్రైస్తవులను మోసం చేశారన్నారు.
source : eenadu.net
Discussion about this post