రాష్ట్రంలో కుట్ర రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబునాయుడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు. శుక్రవారం పాలసముద్రం సింగిల్‌విండో కార్యాలయం వద్ద ఏటీఎం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అవినీతి, అసత్యాలు, వెన్నుపోట్ల చంద్రబాబుకు కాంగ్రెస్ నేత షర్మిల వత్తాసు పలకడం బాధాకరమన్నారు. బాబు చేతిలో షర్మిల, పవన్‌కల్యాణ్ పావులుగా మారారని ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలే కుటుంబసభ్యులని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన జగనన్ననే జనం విశ్వసిస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. జగనన్నను మరోసారి ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు కావడం తథ్యమని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో కరువు విలయతాండవం చేసేదని, జగనన్న సుపరిపాలనలో రాష్ట్ర సుభిక్షంగా ఉందని వివరించారు. పేదల గుండెల్లో జగనన్న ఉంటే, ధనవంతులకు అండగా చంద్రబాబు ఉన్నారని తెలిపారు. నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం విప్లవాత్మక పథకాలు అందిస్తోందని వెల్లడించారు.
source : sakshi.com
Discussion about this post