కార్యకర్తలే తన బలమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండలంలో ఆయన చేపట్టిన యువచైతన్య బస్సుయా త్ర గురువారం మూడవరోజుకు చేరుకుంది. మండలంలోని చీమలవాగుపల్లి, అగ్రహారం, వెంగంపేట, నరసాపురం, పెండేకల్లు, కుమ్మెత, సుంకేసులపల్లి, పసలూరు గ్రామా ల్లో బస్సుయాత్ర నిర్వహించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఆయా గ్రామా ల్లో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరిస్తూ, సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆయన మాట్లాడుతూ వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. సైకో పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. అంతకుమునుపు నరసాపురం గ్రామంలో పలువురు చేనేత కార్మికులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు.
source : andhrajyothi.com
Discussion about this post