ఎన్నికలకు ముందు ఎస్సీలు… నా మేనమా మలు అని చెప్పుకున్న వైఎస్ జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఎస్సీల ద్రోహిగా మారారని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ మండిపడ్డారు. మంగళవారం ఎస్సీ, ఎస్టీ ప్రజా సమైఖ్య ఆధ్వర్యంలో నిర్వహిం చిన బస్సు యాత్రను నగరంలో ప్రారంభిం చిన ఆయన మాట్లాడారు. ఎస్సీల అభ్యున్న తికి గత ప్రభుత్వాలు అమలు చేస్తున్న 27 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. జనసేన, టీడీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన ఆ పథకాలతో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. ఎస్సీలకు జగన్మోహనరెడ్డి చేసిన మోసాన్ని వివరించి ప్రజలను చైతన్యం చేయడం కోసమే ఎస్సీ, ఎస్టీ ప్రజా సమైఖ్య ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర చేపట్టడం శుభపరిణామమన్నారు.
రుద్రంపేట పంచాయతీలోని వికలాంగుకాలనీలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామ్ భక్త హనుమాన విగ్రహ ప్రతిష్ఠకు టీసీ వరుణ్ రూ. 20 వేలు విరాళం అందజేశారు. మంగళవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
source: andhrajyothi.com
Discussion about this post