మీ స్వార్థ ప్రయోజనాల కోసం.. కక్షలు కార్పన్యాలు సృష్టించి.. ఎంతోమందిని బలి పశువులుగా మార్చారని… ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. రక్తపుమరకలు ఎవరికి అంటుకున్నాయో జిల్లా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. రాప్తాడు మండలం జి.కొత్తపల్లి గ్రామంలో ఆమె బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళుతూ బాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ముందుకు సాగారు. అలాగే ఆ పథకాల వలన కలిగే లబ్ధి గురించి కూడా వివరించారు. మరోవైపు బీసీ డిక్లరేషన్ అంశాలను కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడులో అభివృద్ధి చేయడం మానేసి నిత్యం దందాలు భూకబ్జాలలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి తో పాటు ఆయన సోదరులు ఉన్నారని విమర్శించారు. తాము ఏదైనా మాట్లాడితే కుటుంబ చరిత్రల గురించి వక్రీకరిస్తూ మాట్లాడటం అలవాటైందని సునీత ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాప్తాడు నియోజకవర్గంలో నీరు పారిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. పైగా అది మీ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. రక్త చరిత్రలు గురించి మాట్లాడే ముందు మీపై ఉన్న కేసుల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ ఐదేళ్లు ఇలాంటి మాటలే మాట్లాడి పొద్దు గడిపారని అందుకే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మరోసారి వైసిపి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు ఈ విషయం బాగా తెలుసని అన్నారు….

Discussion about this post