ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఆదర్శవంతంగా అభివృద్ధి పనులు సాగుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పులిచెర్ల మండలంలో సుమారు రూ.60 కోట్ల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ముందుగా రూ.5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 2 ఆర్‌ఓ ప్లాంట్లు, ప్రహరీగోడ, రూ.50.0లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, రూ.3లక్షల వ్యయంతో 2 బస్ షెల్ట ర్లు, రూ.3.29 కోట్లతో నిర్మించిన 6 విద్యుత్ సబ్‌స్టేషన్లు, రూ.23.94లక్షలతో సిద్ధం చేసిన 7 రైతుభరోసా కేంద్ర భవనాలు, రూ.20.80లక్షలతో నిర్మించిన 8 హెల్త్ సెంటర్లు, రూ.43.60 లక్షలతో 6 సచివాలయాలు, రూ.1.50 కోట్లతో నిర్మించిన షాదీ మహల్‌ను ప్రారంభించారు. అలాగే రూ. 27.88కోట్లతో నిర్మిచనున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారన్నారు. ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలందించేందుకు సచివాలయాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని వెల్లడించారు. ప్రతి గ్రామానికి రోడ్డు వేయించామని, వాటర్ ట్యాంకులు నిర్మించామని, ఇతర మౌలిక వసతులను పకడ్బందీగా కల్పించామని వివరించారు. ఇంటింటికీ క్రమం తప్పకుండా సంక్షమే పథకాలు అందిస్తున్నామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్పష్టం చేశారు.
source : sakshi.com
Discussion about this post