కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు సమీపంలో రూ.2 కోట్లతో పనులు చేపట్టారు. అభివృద్ధి చేసిన పార్కును మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు ఆదివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొండారెడ్డి బురుజుపై లైట్ అండ్ సౌండ్ షో, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు అధికారులు అత్యుత్సాహం చూపుతూ సీఎం జగన్ చిత్రాన్ని కొండారెడ్డి బురుజుపై ప్రదర్శించారు. అధికారుల తీరును పలువురు తప్పుపడుతున్నారు. చారిత్రక కట్టడంపై ముఖ్యమంత్రి చిత్రం వేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
source : eenadu.net
Discussion about this post